2 సంస్కృత భాష - విశ్లేషణ
శ్రీ గురుభ్యోమ్ నమః
ధర్మము మూడు రకములు.
- కాయిక ధర్మము. (మన శరీరము తో చేసే ధర్మ కార్యము)
- వాచక ధర్మము. (నిరంతరము ఎదుటి వారితో మంచినే మాట్లాడడము, నిత్యమూ భగవన్నామ స్మరణ సంకీర్తనాదులుచేయడము)
- మానసిక ధర్మము. (మంచి సంకల్పములు చేయడము, ఎల్లప్పుడూ మంచి విషయములనే గుర్తుంచుకోవడము)
వాచక ధర్మములో “గీతాపారాయణము” అత్యుత్తమ మైనదిగా చెప్పబడుతోంది.
ద్వాపరయుగము చివరలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఈ భగవద్గీత కలియుగము మొదలై 5000 సంవత్సరములు అయినా ఇంకా ఇప్పటికీ సజీవముగా నేటికీ స్మరించుకుంటున్నాము అంటే ఇది కేవలము పరమాత్మ లీల అనిచెప్పవచ్చు.
Sir Edward Arnold అను ఒక Britisher, The Song Celestial అను పేరుతో భగవద్గీత ను ఆంగ్లములోకి అనువదించారు. ఈఅనువాద ప్రతి విదేశాల్లో చాలా ప్రాముఖ్యతను పొందింది. ముఖ్యంగా సాత్విక ఆహారము స్వయముగా ఆచరిస్తూ తనఅనుయాయులతో కూడా ఆచరింప చేసారు. అంతేకాదు పాల ఆధారిత పదార్థాలను పూర్తిగా విసర్జించి పూర్తి శాఖాహారముఅలవరచుకున్నారు. దీనికి స్ఫూర్తి భగవద్గీతేనని తన పుస్తకములో ఒకచోట వివరించారు.
భగవద్గీత చదివి తాను కూడా ప్రభావితమైన మహాత్మా గాంధీ తన స్వీయ చరిత్ర గా ప్రసిద్ధి పొందిన My Experiments with the Truth అను పుస్తకములో ఒక చోట ఇలా వ్రాసాడు. ఒక ఆంగ్లేయుడైన Edward Arnold భగవద్గీత ను ఆంగ్లములో తర్జుమాచేయగలిగేడు కానీ భారతీయుడైన నేను మన సనాతన భాష అయిన సంస్కృతము రాదు అని చెప్పుటకు చాలా సిగ్గుపడుతున్నాను. నేను మరణించేంత వరకు కూడా ఈ బాధ నన్ను వేధిస్తుంది అని చాలా వేదన చెందాడు.
సంస్కృత శ్లోకములను స్వర భరితముగా ఉచ్ఛరించుట వలన చిన్నపిల్లల మెదడుపై అత్యంత సానుకూల ప్రభావముచూపెడుతుందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సప్రమాణకముగా నిరూపించి వారివారి దేశాలలో ఈ శ్లోకాలను వారి పాఠ్యాంశములుగాముద్రించి ఆ పిల్లలతో సుస్వరంతో చదివేలా తగు శ్రద్ధ తీసుకుంటున్నారు.
సంస్కృత భాషలో రెండు విశిష్టమైన అక్షరాలు ఉన్నాయి. అవి 1) ఃక 2) ఃప
ఇందులో మొదటిది జిహ్వ మూలీయము అనగా నాలుకకు మూలమైన అంగుటి క్రిందుగా గాలి సుడులు తిరిగి వెళ్ళుటచేప్రత్యేకమైన శక్తినిస్తుంది.
రెండవది ఉపధ్మానీయము. అనగా బుగ్గల నిండా గాలి చేరి కంఠములో ప్రవేశిస్తుంది. దీని వలన నాడీ వ్యవస్థ, దవడకండరాలు వాయు ప్రసరణ వలన వృద్ధి చెందుతాయి.
ఈ భాషలో అక్షరాలు శాస్త్రీయ పరముగా ఒక వరుసలో ఉంటాయి. వీటి ఉచ్ఛారణ వలన వచ్చే శబ్దము పుట్టేది మన నాభి నుంచే. నాభి నుండి వాయు ప్రసరణ గా మారి హృదయము, కంఠ ప్రదేశాలు దాటి మన నోటిలోని అన్ని భాగాలు తాకుతూ బయటకువస్తుంది. ఏ ఏ భాగాలు ఏ ఏ అక్షరాలు తాకుతాయి అన్నది నిర్దుష్టముగా చెప్పబడింది.
ఆ కూ (క వర్గము) ః (హ) = విసర్జనీయానాం కంఠః
అనగా నాభి నుండి బయలుదేరి కంఠ ప్రదేశమును తాకితే వచ్చే అక్షరాలు ఇవి.
అచ్యుత అను నామాన్ని జపించుట వలన స్మరణ బాగుగా ఉంటుంది. స్మరణకు, చిత్తమునకు అధిదేవత అచ్యుతుడు. ఈభగవద్గీతా పారాయణము వలన పూర్వ జన్మ స్మృతులు కూడా కలుగుతాయి.
భగవద్గీతలో రెండవ అధ్యాయములో 2 వ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యుద్ధము చేయను అనడం “అనార్యజుష్టం” అని అంటాడు. అంటే శ్రేష్టులైనవారు అనవలసిన మాట కాదు అని అర్ధము. ఆర్యులు అనగా శ్రేష్టులు. కానీ మనము దాదాపుశతాబ్దాల పాటు విధర్మీయుల పాలనలో మగ్గి ఉన్నాము. వారి యొక్క వాసనలు ఇంకా వదలలేదు.
ఎన్నో దేశాలు తమ తమ మతాలు, ఆచారాలు, వ్యక్తిత్వ మనుగడలు విదేశ దురాక్రమణలో పూర్తిగా పోగొట్టుకొని ఆక్రమణదారుల మత, ఆచారాలను తమవి గా చేసుకొన్నాయి. కానీ ఒక్క భారతీయులు మాత్రము శతాబ్దాల పాటు అనేక దేశాల వారి పాలనలోఉన్నా మన ధర్మాన్ని జీవన విధానాన్ని వదులుకోలేదు. అందుకు కారణం మన సనాతన ధర్మంలోని విశిష్టత, మన దేవీ దేవతలపైనా మరియు పూజనీయమైన వేద, పౌరాణిక, ఇతిహాస గ్రంధాల గొప్పతనము. ఇది గ్రహించిన ఆంగ్లేయులు ఏ విధముగా నైనామనలను మానసికముగా వారి బానిసలుగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసారు. అందులో ముఖ్యమైన రెండు పద్ధతులనుచూద్దాం.
మొదటగా మన గ్రంధములను కించపరుచుట. రెండు మన భారతీయతను ప్రశ్నార్ధకము చేయుట.
1 సకల భాషలకు మూలమైన మన సంస్కృత భాష ప్రాచీన మైనది కాదు అది INDO EUROPEAN భాష నుంచి పుట్టినదనితమ LATIN భాషకు సోదరి వంటిదని నమ్మించ సాగారు. ఇందుకు మనలో కొంతమంది కుహనా మేధావులు వత్తాసుపలికారు. అంతేకాదు ప్రపంచములోనే ఆదికావ్యాము గా ప్రసిద్ధి గాంచిన “రామాయణ” గ్రంధము “మహాభారత” గ్రంధముతరువాత వ్రాయబడినదని కూడా నమ్మించబోయారు.
2 భారతదేశము లో నివసిస్తున్న వారందరూ ఇరాన్ అను దేశము నుంచి సంచార జీవితము (NOMADIC CULTURE) గడుపుతూ ఇక్కడికి వచ్చి స్థిరపడినారు అని వాదించేరు. శ్రీరామ చంద్ర మూర్తి ఆర్యుడని అనగా నరులలో శ్రేష్టుడనే భావనతోమనము కొలుస్తాము. కానీ ఆంగ్లేయులు ఆ పదము ఇరాన్ అన్న దేశముకు సంబంధించినది కనుక ఆర్యుడైన రాముడు ద్రావిడులైన (అప్పటికే భారతదేశము లో ద్రావిడులనే తెగ ఒకటుందని ఆంగ్లేయుల వాదన) రావణుడిని చంపి ఇక్కడ స్థిర నివాసమేర్పరుచు కొన్నారని వాదిస్తున్నారు. అందుకే మనలను INDO ARYANS అనాలనే విషయాన్ని మన పాఠ్యపుస్తకాలలోజొప్పించారు.
ఈ విధంగా మనలను 150 సంవత్సరముల బాటు వంచించారు. కానీ వీరి వాదనలను మనతో బాటుగా కొంతమందిEUROPEAN దేశస్థులు ఇలా ఖండించారు.
1 ఎటువంటి ARCHEALOGICAL EVIDENCE (శిలాఫలకములు లేదా శిలాశాసనాలు) లేకుండా, కనీసం వారు ప్రస్తావించినINDO EUROPEAN LANGUAGE SCRIPT (భాష యొక్క లిపి) లేకుండా సనాతనమైన సంస్కృతభాష అందులోనుంచివచ్చినదని ఏ విధంగానూ నమ్మశక్యము కానిది.
2 ఎటువంటి GENOLOGICAL EVIDENCE DNA (జీవనప్రమాణము) లేకుండా ఇరాన్ దేశమునుంచి వచ్చిన సంచారజాతిఅని భారతీయులను ఎలా అనగలరు?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి