భగవద్గీత

 శ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి భట్ 

(వేద పండిట్తి.తి.దేతిరుమల)


శ్రీ గురుభ్యోమ్ నమః


వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః 

పౌత్ర మకల్మషం 

పరాశరాత్మజం వందే శుక 

తాతం తపోనిధిం 


వ్యస్యతి వేదానితి వ్యాసః” అనంతమైన వేదరాశిని నాలుగు విభాగములు చేసినటువంటి వాడువశిష్ఠ మహర్షికి మునిమనుమడుశక్తి అను మహర్షికి మనుమడు, “వ్యపేత కల్మషః నిత్యం బ్రహ్మలోకే మహీయతే” అను పురాణ వచనం అనుసరించినిత్యము బ్రహ్మ లోకములో అందరిచే పూజింపబడునట్టి కల్మష రహితుడుపరాశర మహర్షి కొడుకూ మరియు “తదిదంగ్రాహయామాస సుతం ఆత్మవతామ్ వరమ్” అనగా ఆత్మజ్ఞానము కల వారందిరిలో అగ్రేసరుడిగా కొలువబడు తున్నటువంటిమరియు తండ్రి ద్వారా మొదటగా భాగవతమును ఉపదేశము పొందిన శుక మహర్షి కి తండ్రి అయిన శ్రీ శ్రీ శ్రీ వ్యాసుల వారినిప్రార్ధిస్తున్నాను


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే 

నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమోనమః 


వ్యస్యతి వేదానితి వ్యాసః” అనగా అనంత వేదరాశిని వేద విభాగము చేసిన వాడు కాబట్టి వ్యాసః అన్నారు

విష్ణురూపః - శంకరశ్శంకరో సాక్షాత్ వ్యాసో నారాయణో హరిఃఅనగా శంకరాచార్యుల వారు శంకరుడంతటి వాడుఅలాగేవ్యాసుడు విష్ణుమూర్తి తో సమానమువ్యాసరూపాయ విష్ణవే -  వ్యాసునికి విష్ణువుకి అభేదం విధముగా విష్ణుమూర్తిజగత్తునంతా వ్యాపించి ఉన్నాడో  విధముగా విజ్ఞానములో (వేదాలుఇతిహాసములుఅష్టాదశ పురాణములు మున్నగునవిరచించారువ్యాసుల వారు  జగత్తుని నింపివేసారుబ్రహ్మనిధి - వారు రచించి అందించి నదంతా ఒక విజ్ఞాన ఖనివాసిష్టాయ -  ప్రకృష్టమైనఅతిశయమైన అటువంటి మహర్షిని నమస్కరిస్తున్నాను

కామెంట్‌లు